ప్రపంచంలోని అత్యుత్తమ ఆన్‌లైన్ స్టోర్‌లు దీనిపైనే నిర్మించబడ్డాయి
Shopify
అత్యధికంగా కన్వర్ట్ అయ్యే చెక్‌అవుట్ మరియు ప్రతి వ్యాపార పరిమాణానికి సరిపోయే అనువైన ఎంపికలతో, Shopify స్టోర్‌లు ఎక్కువ ఉత్పత్తులను విక్రయిస్తాయి, మీ ఖర్చులను తగ్గిస్తాయి మరియు మీ సమయాన్ని ఆదా చేస్తాయి.














ప్రతి స్టోర్‌లో ముందుగానే ఉంటుంది

చిరుతపులికి మించిన వేగం.
సరిపోల్చలేని విశ్వసనీయత.

ప్రపంచంలోనే
ఉత్తమ చెక్‌అవుట్

అడుగడుగునా
శక్తివంతమైన AI
మీరు ఎలా నిర్మించాలనుకుంటున్నారో ఎంచుకోండి
Shopify థీమ్‌లు
సృజనాత్మకతకు వాణిజ్యం తోడైన వేళ
వెంటనే విక్రయించడానికి సిద్ధంగా ఉండే ఫౌండేషన్‌పై మీ విశిష్టమైన బ్రాండ్ విజన్‌ను తీర్చిదిద్దుకోండి. మీ బ్రాండ్‌ను ప్రతిబింబించే ఒక థీమ్‌ను ఎంచుకోండి, ఆపై దాన్ని మీ స్వంతం చేసుకోండి.

మీ విజన్‌కు ప్రాణం పోయండి
మీరు ప్రతి వివరంలోనూ పర్ఫెక్ట్‌గా ఉండేలా చేసే శక్తివంతమైన అనుకూలీకరణ సాధనాలు. ఎలాంటి కోడింగ్ అవసరం లేదు—కేవలం మీ ఊహాశక్తి ఉంటే చాలు.
పూర్తిగా మీకనుగుణమైన బ్లాక్‌లను సృష్టించండి
మీరు కోరుకునే దాన్ని కొన్ని మాటలలో చెప్పండి, తద్వారా మీ విజన్‌కి సరిపోయే కొత్త కంటెంట్ బ్లాక్‌లను AI రూపొందిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా లేదా టోకుగా విక్రయించండి
సందర్భోచిత స్టోర్‌ఫ్రంట్‌ల సాయంతో, అంతర్జాతీయ మరియు B2B కస్టమర్‌ల కోసం విభిన్న ఉత్పత్తులు మరియు ధరలను ప్రదర్శించండి.

లాగి వదలండి
Shopify ఆన్‌లైన్ స్టోర్ ఎడిటర్‌తో సులభంగా పేజీలను జోడించండి, లేఅవుట్‌ను మార్చుకోండి.
కామర్స్ యాప్‌లతో మరిన్ని చేయండి
ఎంచుకోవడానికి అందుబాటులో ఉన్న 16000+ యాప్‌లతో, అదనపు ఫీచర్‌ల నుండి కస్టమ్ ఉత్పత్తి ఎంపికల వరకు మీ స్టోర్‌కు అవసరమైన ఏ అదనపు ప్రయోజనాన్నైనా Shopify App Store అందిస్తుంది.
దానికి తోడు మీకు అవసరమైన అన్ని ఫీచర్‌లు, తక్షణమే సిద్ధం
ప్రపంచంలోనే బెస్ట్ కన్వర్టింగ్ చెక్‌అవుట్
AI సాధనాలు
వీడియోలు మరియు 3D మోడల్స్
శోధన మరియు ఫిల్టరింగ్
భాషలు మరియు కరెన్సీలు
ఉత్పత్తి సిఫార్సులు
వేగవంతమైనది మరియు యాక్సెస్‌కు సులభమైనది
మొబైల్-రెడీ
ప్రయాణం మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా?
కస్టమ్ ఎంపికలు
మీరు నిర్మించాలనుకునేదానిని ఏదైనా సరే ఇక్కడ నిర్మించవచ్చు


Liquidని ఎంచుకోండి
మీ బ్రాండ్‌కు తగ్గట్లుగా విలక్షణమైన స్టోర్‌ను సృష్టించండి. నిర్వహణ బాధ్యతను మాకు వదిలేయండి.

వేగంగా మరియు సులభంగా నిర్మించండి
Shopifyకి చెందిన అద్భుతమైన టెంప్లేటింగ్ భాష అయిన Liquidతో, మీకు కావలసిన ఖచ్చితమైన రూపం మరియు అనుభూతితో మీరు త్వరగా కస్టమ్ స్టోర్‌ను సృష్టించవచ్చు. దానికి తోడు ఇది పాత ఫేవరెట్స్ అయిన HTML, CSS, JavaScript మరియు JSONలతో కూడా కలిసి పనిచేస్తుంది.

వేగం. భద్రత. విశ్వసనీయత.
అప్‌టైమ్‌ను పర్యవేక్షించడం, వేగం కోసం ఆప్టిమైజ్ చేయడం, బాట్‌లను దూరంగా ఉంచడం—ఇలాంటివన్నీ మేమే చూసుకుంటాము. కాబట్టి మీరు ఏదైనా పెద్ద ఆఫర్‌ను ప్రకటించినా లేదా కొత్త దేశంలో లాంచ్ చేసినా, మీ స్టోర్ సురక్షితంగా, విశ్వసనీయంగా మరియు వేగంగా రన్ అవుతుందనే భరోసాతో ఉండవచ్చు.

ప్రతి ఒక్కరూ ఉపయోగించగల ఎడిటర్
ఏ టీమ్ దేనిలో బెస్ట్ అయితే ఆ పనిని ఆ టీమ్‌కే వదిలేయండి. ఏ టీమ్ అయినా కంటెంట్‌ను సవరించగలదు, ల్యాండింగ్ పేజీలను ప్రారంభించగలదు మరియు డిజైన్‌ను సైతం అప్‌డేట్ చేయగలదు. కాబట్టి డెవలపర్లు కీలకమైన అంశాలపై మాత్రమే దృష్టి సారించవచ్చు. ఎలాంటి ఆటంకాలూ ఉండవు. ఎవరి అనుమతులూ అవసరం లేదు.
మీ స్వంత థీమ్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారా?
హెడ్‌లెస్‌కు వెళ్లండి
మీ స్వంత స్టాక్‌ని ఎంచుకోండి
మీ వ్యాపారానికి ఖచ్చితంగా అవసరమైన స్టోర్‌ను పొందండి. మీరు ఇప్పటికే ఇష్టపడే టెక్‌ని ఉపయోగించుకునే స్వేచ్ఛ మీ సొంతం.



పటిష్టమైన APIలు
Shopify స్టోర్‌ఫ్రంట్ API మిలియన్ల కొద్దీ క్వెరీలను అందజేస్తుంది మరియు గ్లోబల్ ఎడ్జ్‌లో డిప్లాయ్ చేయబడింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లు తాము ఏ పరికరంలో షాపింగ్ చేసినా అద్భుతమైన లోడ్ వేగాన్ని అనుభూతి చెందుతారు. అంతేకాక ఎలాంటి రేట్ పరిమితులు లేకపోవడం వల్ల, మీరు ఎలాంటి అవరోధాలు లేకుండా లేదా ఊహించని బిల్లుల ప్రసక్తి లేకుండా పెద్ద సేల్స్ ఈవెంట్‌లను సైతం రన్ చేయవచ్చు.
డాక్స్ గురించి పూర్తిగా తెలుసుకోండిHydrogenతో సగం సమయంలోనే హెడ్‌లెస్ సైట్‌ను లాంచ్ చేయండి
Shopify హెడ్‌లెస్ కామర్స్ టూల్‌కిట్ అయిన Hydrogenతో అభివృద్ధిని వేగవంతం చేయండి. ఏ ఫ్రేమ్‌వర్క్‌లోనైనా పని చేసే కాంపోనెంట్‌లు, హుక్స్ మరియు యుటిలిటీలతో సెటప్‌ను స్కిప్ చేయండి—ఇవన్నీ కామర్స్ కోసం ఆప్టిమైజ్ చేయబడినవి మరియు Shopify APIలతో పని చేసేందుకు ముందే కాన్ఫిగర్ చేయబడినవి.
Hydrogen గురించి మరింత తెలుసుకోండిOxygenలో ఉచితంగా హోస్ట్ చేయండి
కేవలం Starter మినహా అన్ని Shopify ప్లాన్‌లలోనూ అందుబాటులో ఉండే, మా ఉచిత గ్లోబల్ హోస్టింగ్ పరిష్కారమైన Oxygen సాయంతో మీ Hydrogen స్టోర్‌ను తక్షణమే డిప్లాయ్ చేయండి. లేదా మీరు ఇష్టపడే ప్రొవైడర్‌తో సైతం హోస్ట్ చేసుకోవచ్చు.
Oxygen గురించి మరింత తెలుసుకోండికస్టమ్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా?
Shopifyలోని మిలియన్ల కొద్దీ వ్యాపారుల సరసన చేరండి
అన్ని రకాల వ్యాపారాలు. అన్ని రకాల స్టోర్‌లు. అన్నీ విక్రయాల కోసమే నిర్మించబడ్డాయి.

మా డెవలప్మెంట్ ప్రాసెస్‌పై పూర్తి నియంత్రణను ఉంచుకుంటూనే అత్యంత అద్భుతమైన కస్టమర్ అనుభవాలను రూపొందించడానికి Shopify మమ్మల్ని అనుమతించింది.
































