ఉచిత సాధనాలు
ఉచిత ఆన్లైన్ బార్కోడ్ జనరేటర్
బార్కోడ్ జనరేటర్
ప్రత్యేకమైన, అనుకూలీకరించిన బార్కోడ్లతో మీ ఉత్పత్తులను ట్రాక్ చేయండి, నిర్వహించండి. Shopify ఆన్లైన్ బార్కోడ్ జనరేటర్ అనేది చాలా వేగవంతమైనది, ఉపయోగించడానికి ఎంతో సులభమైనది. మీ ఇమెయిల్ అడ్రస్‌తో పాటు మీ బార్కోడ్ పక్కన కనిపించాలనుకుంటున్న టెక్స్ట్ లేదా డేటాను నమోదు చేసి, 'సమర్పించండి' పై క్లిక్ చేయండి. కేవలం కొన్ని సెకన్లలో, మీరు కొత్త బార్‌కోడ్‌ను జనరేట్ చేసి, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
- మీ ఇమెయిల్ అడ్రస్‌ను నమోదు చేయండి
- మీ బార్కోడ్ డేటాను నమోదు చేయండి
- మీ బార్‌కోడ్‌ను జనరేట్ చేయడానికి “సమర్పించండి” పై క్లిక్ చేయండి
అంతే! మీ బార్‌కోడ్‌కు సంబంధించిన PNG ఫైల్ మీ ఇన్‌బాక్స్‌కు వస్తుంది, దానిని వెంటనే ఉపయోగించుకోవచ్చు.
అవును. బార్‌కోడ్‌లను ఎక్కడ జనరేట్ చేశారు అన్నదానితో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే బార్కోడ్ స్కానర్ల ద్వారా వాటిని చదవవచ్చు, ఇవి దాదాపు సార్వత్రిక భాషలా పని చేస్తాయి. అయితే వాస్తవానికి రెండు రకాల బార్కోడ్లు ఉన్నప్పటికీ, ఆ రెండింటినీ అర్థం చేసుకునేలా ప్రతి స్కానర్ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది.
యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్ (UPC) బార్కోడ్లు గ్లోబల్ EAN-13 బార్కోడ్లు కావచ్చు లేదా US/కెనడాకు చెందిన UPC-A బార్కోడ్లు కావచ్చు. బార్కోడ్ ఇమేజ్ చూడటానికి ఒకేలా కనిపించవచ్చు, కానీ బార్కోడ్ డేటా ఇన్పుట్లు భిన్నంగా ఉంటాయి.
ఈ పేజీలో ఉన్న మా బార్కోడ్ జనరేటర్ లాంటి వెబ్-ఆధారిత సాధనాన్ని ఉపయోగించి మీరు ఉచితంగా బార్‌కోడ్‌ను జనరేట్ చేయవచ్చు. బార్‌కోడ్‌ను రూపొందించడానికి, మీ ఇమెయిల్‌ను అలాగే మీ బార్‌కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు కనిపించాలనుకుంటున్న టెక్స్ట్ లేదా మీ సొంత డేటాను నమోదు చేసి, 'సమర్పించండి' పై క్లిక్ చేయండి.
మీరు సమర్పించిన తర్వాత, అటాచ్ చేసిన అనుకూలీకరించిన బార్‌కోడ్‌తో కూడిన ఇమెయిల్‌ను అందుకుంటారు. అటాచ్‌మెంట్‌ను తెరిచిన తర్వాత, మీరు నమోదు చేసిన డేటాను చూడటానికి బార్కోడ్ ఇమేజ్ను స్కాన్ చేయవచ్చు. మీరు మీ బార్‌కోడ్‌ను PNG ఫైల్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీ వ్యాపారం కోసం మీకంటూ సొంత గుర్తింపు సంఖ్య కావాలా వద్దా అన్నదానిపై ఆధారపడి, UPCని జనరేట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
మీకు సొంత గుర్తింపు సంఖ్య కావాలనుకుంటే, గ్లోబల్ స్టాండర్డ్స్ సంస్థ అయినటువంటి అలాగే UPC కోడ్లను అందించే అధికారిక ప్రొవైడర్ అయిన GS1 USలో మీరు ముందుగా పెయిడ్ మెంబర్షిప్ పొందాలి. ఆ తర్వాత, మీరు వారి నుండి UPCలను కొనుగోలు చేయవచ్చు. నేరుగా GS1 US నుండి కొనుగోలు చేసిన UPCలు, మీ స్వంత, ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటాయి.
ఒకవేళ మీకు సొంత గుర్తింపు సంఖ్య అవసరం లేకుంటే, కొన్ని కంపెనీలు GS1 US నుండి పెద్ద మొత్తంలో UPCలను కొనుగోలు చేసి వాటిని ఇతర వ్యాపారాలకు విక్రయిస్తాయి. GS1 USలో చేరడానికి అయ్యే ఖర్చు అలాగే శ్రమను ఆదా చేసుకోవడానికి మీరు ఆయా కంపెనీల నుండి కూడా UPCలను పొందవచ్చు.